అల్లాహ్ ఛాలెంజ్ - రామ్ రహీమ్ ల చర్చ

  • మరియు మేము మా దాసుని (ము’హమ్మద్)పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహ ముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరుసత్యవంతులేఅయితే (ఇది చేసిచూపండి). (Quran 2:23 )
  • ఏమీ? వారు ఖుర్ఆన్ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చివుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!
     (Quran 4:82 )
  • అయినా వారు: ''అతనే (ము'హమ్మదే) దీనిని కల్పించాడు.'' అని అంటున్నారా? వారితో అను: ''మీరు సత్య వంతులే అయితే – అల్లాహ్ను విడిచి మీరు పిలువగలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని – దీనివంటి ఒక్క సూరహ్నైనా (రచించి) తీసుకురండి!'' (Quran 10:38)
  • లేదా వారు: ''అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ను) కల్పించాడు.'' అని అంటు న్నారా? వారితో అను: ''మీరు సత్య వంతులే అయితే – అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచు కొని – దీనివంటి పది సూరాహ్లను కల్పించి తీసుకురండి!'' (Quran 11:13)
  • ఇలా అను: ''ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకురావటానికి ప్రయత్నించినా – వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ – ఇటువంటి దానిని కల్పించి తేలేరు.'' (Quran 17:88 )
  • వారు సత్యవంతులే అయితే దీనివంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను. (Quran 52:34 )

రాము, రహీము మంచి స్నేహితులు. పండగలు పబ్బాలు తప్ప మతాలని పెద్దగా ఆచరించని వారు. ఇంటర్ సెలవులు. ఇదే అవకాశం అని ఇస్లాం మరియు ఖురాన్ రహీముకు నేర్పించడం కోసం అతనిని మసీదుకు పంపుతున్నారు వారి తల్లదండ్రులు. కొత్తగా ఇస్లాం నేర్చుకుంటున్న రహీముకి ఇస్లాం ని ఒక అద్భుమైన మతంగా, ఖురాన్ ఈ రోజుల్లో మిగిలి ఉన్న ఏకైక స్వచ్ఛ దైవ గ్రంధంగా మసీదు పెద్దలు ప్రభావితం చేయసాగారు. ఇప్పటి వరకు ఖురాన్ ను తప్పు అని నిరూపించిన వారు ఒక్కరూ లేరు అని వారి వద్ద విన్న రహీమ్ నిజంగా ఆశ్చర్యపోయి, దానికి ప్రభావితం అయ్యాడు. ఇదే దైవ గ్రంధం అయితే తన ప్రాణ స్నేహితుడు అయిన రాముని కూడా ఇస్లాం మతం స్వీకరించే లా చేద్దాం అనుకున్నాడు. ఇక అనుకున్నదే తడవుగా రాముతో ఇస్లాం గురించి చెప్పటం మొదలుపెట్టాడు. 

రహీమ్: రేయ్ రాము! ఇస్లాం గురించి ఏమైనా తెలుసా నీకు?
రాము: తెలియదు రా. ఏ ?
రాహీము: ఎం లేదు రా. ఈ మధ్యే మసీదుకు వెళ్తున్నాను కదా. చాలా విషయాలు తెల్సుకున్నాను ఇస్లాం గురించి.
రాము: అవునా! ఏంటి ఆ విశేషాలు చెప్పు తెలుసుకుందాం.
రహీము: చాలా ఉన్నాయి కానీ ముందు ఈ కరపత్రం తో మొదలు పెడదాం.
( అవిశ్వాసులు అల్లాహ్ ఛాలెంజ్ అని పైన చెప్పిన వాక్యాలతో కూడి ఉంటుంది ఆ కరపత్రం.)

రాము: చదివాను రా! కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మొదట 4:82 లో దైవగ్రంధం అవ్వాలంటే పరస్పర వైరుధ్యాలు ఉండకూడదు అన్న దగ్గర నుంచి చూద్దాం.
ఖురాన్ లో ఎన్ని సార్లు ఆ ఛాలెంజ్ పునవృతమైందో చూసావు కదా.
రహీమ్: హా! దాదాపు అయిదు సార్లు.
రాము: 
   నా సందేహం 1: 
    ఏమిటంటే ఒక విషయాన్ని అయిదు సార్లు చెప్పవలసిన అవసరం ఎం వచ్చింది? అదీ వేరు వేరు చోట్ల.
  సందేహం 2: 
     పరస్పర వైరుధ్యాలు ఉండకూడదు అన్నాయన చేసిన ఛాలెంజ్ ని గమనిస్తే , ఒక చోట ఒక సూరా తీసుకురండి అంటాడు. మరొక చోట పది సూరాలు కావాలి అంటాడు. మరొక చోట ఒక్క ఆయత్(వచనం) చాలు అంటాడు. ఇవన్నీ పరస్పర వైరుధ్యాలు కాదంటావా?  తన  గ్రంధం నిరూపించుకోవటానికి తను పెట్టుకున్న కొలమాననానికి, తన మరొక కొలమానం ద్వారా ఫెయిల్ అవుతున్నాడు అన్నది నీకు తెలియటం లేదా?

రహీమ్: ఆలోచిస్తుంటే నువ్వు చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది. కానీ అల్లాహ్ చేసిన ఛాలెంజ్ ని ఇప్పటవరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు అంట. కొందరైతే అలా ఖురాన్ వంటిది రాసే ప్రయత్నాలు చేశారట. వారి చిత్తు పత్రులే గుట్టలు గుట్టలు నిండేవి అంట. కానీ ఎవ్వరూ ఆయన ఛాలెంజ్ ని గెలువలేక పోయారట.

రాము: అవునా! హహహ!
రహీమ్: ఎందుకు నవ్వుతున్నావ్?
రాము: నవ్వక ఏం చేయమంటావు? 4:82 చూడు. అల్లాహ్ తప్ప ఇంకెవరు గ్రంధం రాసినా అందులో పరస్పర వైరుధ్యాలు కనిపిస్తాయంట. మా అమ్మమ్మ ఒక గ్రంధం రాసింది. అందులో ఒక్కటంటే ఒక్క వైరుధ్యం చూపించు.
రహీమ్: ఏంటి మీ అమ్మమ్మ గ్రంధాలు రాస్తారా? ఇంతకీ ఏంటి రా ఆ పుస్తకం?
రాము: శ్రీరామ కోటి రా నాయన
రహీమ్: అవును రా. కరెక్టే. కానీ అది వేరు కదా. ఏదైనా  సబ్జెక్ట్ ఉన్న గ్రంథం అలా పరస్పర వైరుధ్యాలు లేకుండా ఉన్నాయా?
రాము: ఓ! ఎందుకు లేవు? మన సైన్స్ పుస్తకాలు, మాథ్స్ పుస్తకాలు అన్నీ అవే కదా. 
రహీమ్: అవును.
రాము: సరే. ఇప్పుడు మళ్లీ ఆ ఛాలెంజ్ దగ్గరికి వద్దాం. దాని వంటి ఒక్క వచనాన్ని రచించి తెమ్మంటున్నాడు. దాని వంటిది అంటే ఏంటి? అక్కడ ఏం ఉందో అదే రాస్కెలితే దాన్ని అటువంటి వాక్యం అనవచ్చా?
రహీమ్: అదెలా అవుతుంది? అలా చేస్తే కాపీ అవుతుంది కదా. పైగా అల్లాహ్ సహాయం తీసుకున్నట్టు అవుతుంది. ఛాలెంజ్ fail అవుతావు కదా. ఖురాన్ లోని వచనాల వంటివి అంటున్నారు. ఏ విషయంలో పోలిక కలిగి ఉండాలి అన్నది స్పష్టత లేదు.
రాము: అదే కదా నాయన కిటుకు. చూడటానికి పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది పిచ్చి ప్రేలాపన తప్ప ఇంకేం కాదు. ఒక  ఆసామి ఈ దేశంలో  నేనే పెద్ద సైంటిస్ట్ ని. కాదు అంటారా? నాలాగే ఉండేవాడిని ఇంకొకరిని పట్టుకు వచ్చి మీ మాట నిరూపించుకోండి అన్నాడట. ఆడు నిజంగా సైంటిస్ట్ ఓ కాదో తెల్వాలంటే ఆడికి సైన్స్ ఎంత వచ్చో పరీక్షించాలి కానీ, ఆడి లాగా ఇంకెవ్వరూ లేకపోతే ఆడు సైంటిస్ట్ అవుతాడా? ఆడి లాంటి మరొకడు ఉంటే వీడు సైంటిస్ట్ కాకుండా పోతాడా. 
అసలు ఒకటి దైవ గ్రంధమో కాదో తేల్చుకోవడానికి ఏం చేయాలో ఖురాన్ రాసినోడికే తెలియదు అనిపిస్తుంది. పోనీ తను చెప్పుకున్న లెక్క ప్రకారం చూసుకున్నా ఆ చాలెంజ్ వచనాలలోనే వైరుధ్యాల వలన దైవ గ్రంధం కాదు అని తెలుస్తుంది.
ఖురాన్ గొప్పతనం చెప్పి ఇస్లాంకు దగ్గర చేద్దామనుకున్న నీ కరపత్రం, జాగ్రత్తగా చదివితే అదే ఖురాన్ లోని లోపాలను చూపించి ఇస్లాం కి దూరంగా తీసుకు వెళ్లగలదు.
రహీమ్:
ఇంత కాలం మనం మతాలను పట్టించుకోకుండా ఉన్నాం కానీ ఇది చూస్తుంటే తనదే గొప్ప మతం మిగతావన్నీ కల్పితాలు ఉన్న మతాలు అన్నట్టు చెప్పుకునే జాకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఎలాంటి సరుకును తమ నెత్తిన మోస్తూ నా లాంటి వారితో మోయిస్తున్నారో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటివి ఇంకా చూడాలని ఉంది ఖురాన్ లో.
నా కళ్లపై ఉన్న ఒక్కొక్క పొర తొలగించుకోవాలని ఉంది.
రాము: తప్పకుండా అధ్యయనం చేద్దాం. సరే మిత్రమా పని ఉంది మళ్లీ కలుద్దాం. సెలవు.
రహీమ్: అలాగే. Bye.

Comments

  1. ఇలాంటి గ్రంథాన్ని రచించి తీసుకురండి అని ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేయవచ్చు...😁😂😀

    ReplyDelete

Post a Comment