ఖురాన్ అవిశ్వాసం కారణంగా చంపమంటుందా? ఖురాన్ 18:80 అసలు ఎం చెప్తుంది?



ప్రియమైన మిత్రులారా! ఈ రోజు చాలా రోజుల విరామం తరువాత ప్రియ మిత్రుడు హుస్సేన్ గారిని కలవటం జరిగింది. మాటల మధ్యలో ఖురాన్ 18:80 ప్రస్తావన వచ్చింది. సత్యాన్వేషణ మండలి కార్యక్రమాలలో పాల్గొంటున్న వారికి ఆ వాక్యం గురించి తెలిసే ఉంటుంది. ఫజులుర్ రెహమాన్ గారు 'ఒక వ్యక్తి అవిశ్వాసం కారణంగా అతనిని చంపమని ఎక్కడైనా ఇస్లాంలో ఉంటే ఇస్లాం విడిచి బయటకు వచ్చేస్తానని' చేసిన సవాలుకు స్పందనగా సత్యాన్వేషణ మండలి తరపున మనం ప్రతిపాదించిన వాక్యం ఇది. అదేంటో ఇక్కడ రాస్తాను.
ఖురాన్ 18:80 :-

  وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا
"ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది."
ఫజులుర్ రహ్మాన్ గారు చేసిన సవాలు ప్రకారం ఈ వాక్యం ఆధారంగా ఆయన బయటకు రావలసిన పరిస్థితి ఏర్పడింది అన్నాను నేను.
దానికి మన హుస్సేన్ గారు, లేదు లేదు ఆ వాక్యాన్ని మీరు తప్పుగా అర్ధం చేస్కున్నారు. అందులో అవిశ్వాసం కారణంగా చంపమని లేదు. తల్లిదండ్రులను వేధించిన కారణంగా చంపమన్నాడు అని ఉంది. అక్కడ తిరస్కారం అనినా కూడా తల్లిదండ్రులను వేధించటమే అన్న వాదన వినిపించారు.
నేను నేను మళ్ళీ ఒకసారి ఆ వాక్యం తీసి చదువుకున్నాను. అక్కడ ఏముందో చూద్దామని. తిరస్కార వైఖరికి అరబ్బీ లో ఏ పదం వాడారో చూస్తే "కుఫ్రన్" అనే పధం వాడారు . అది  ఖురాన్ లో దైవ తిరస్కారానికి అంటే అవిశ్వాసానికి వాడిన పదం, కాబట్టి అవిశ్వాసి అవుతాడేమో అన్న భయం కారణంగానే కదా ఆ బాలుడిని చంపింది అన్నాను నేను. దానికి హుస్సేన్ గారు కాదు కాదు మీరు సరిగ్గా చూడండి. అక్కడ వేధిస్తాడని భయం తో చంపాడు అన్నారు. నేను 'అసలు ఎం చేసి వేధిస్తాడు అది చెప్పండి ముందు తలబిరుసుతనం, తిరస్కార వైఖరి తో వేధిస్తాడు అని ఉంది కదా' అన్నాను. మరింత చర్చించే లోపు ఆయన నమాజు టైం ఐపాయింది. నా భోజనం టైం ఐపాయింది. నేను ఇలా లేఖ రాస్తానని చెప్పి, బయలుదేరి ఇదిగోండి, ఇలా ఈ లేఖ రాస్తున్నా.
అయితే పై వాక్యాన్ని విశ్లేషించే ముందు హుస్సేన్ గారికి ఉన్న ఒక తప్పు అభిప్రాయాన్ని చెప్తాను. హుస్సేన్ గారు ఏమంటున్నారంటే 'తల్లి దండ్రులకు గౌరవం ఇవ్వకపోవటం కూడా కుఫ్ర్(దైవ తిరస్కారం) క్రిందకే వస్తుంది' అని. నేను చెప్పేదేమిటంటే అది ఏమీ కుఫ్ర్ కిందకి రాదు. కుఫ్ర్ అంటే ఒక నిర్దిష్టమైన అర్ధం ఉంది. ఏ వ్యక్తి అయితే ఖురాన్ ను ఖురాన్ చెప్పే దైవాన్ని,దూతలను, గ్రంధాలను, ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరిస్తాడో అతను కాఫిర్ అవుతాడు. అలా తిరస్కరించటాన్ని కుఫ్ర్ అంటారు. ఈ కుఫ్ర్ గుర్తించటానికి వివిధ సూచనలు ఇచ్చారు ఖురాన్ లో.
ఉదా: జకాత్ చెల్లించకపోవటం, నమాజ్ చదవకపోవటం, ఇలాంటివి చాలానే ఉన్నాయి.
కుఫ్ర్ గుర్తించటానికి సూచనలలో ఒకటిగా ఈ 'తల్లిదండ్రులకు అగౌరవం చూపటం' లాంటి అంశం తీసుకోవచ్చునేమో కాని, కుఫ్ర్ అంటే 'తల్లిదండ్రుల మాట వినకపోవటం, అగౌరవించటం' అననే కూడదు.
అరబ్బీ లో తలబిరుసుతనానికి తుగ్యనాన్ అనే పదం వాడబడింది. ఆంగ్లం లో transgression అన్నాడు. దాని తెలుగు అర్ధం అతిక్రమించటం. ఏ పని చేసి ఆ తల్లి దండ్రులని బాధ పెడతాడు అని నేను వేసిన ప్రశ్నకు సులభంగా అవిశ్వాసం, కుఫ్ర్ చేసి వాళ్ళని బాధ పెడతాడు అని సులభంగా చెప్పెయ్యవచ్చు.ఎందుకంటే ఇదే వాక్యంలో తల్లిదండ్రులు విశ్వాసులు అని ఉంది. విశ్వాసులకి మనసు నొప్పించే మొదటి పని ఏమిటి అంటే అవిశ్వాసమే కదా. అతని తిరస్కారం, అతిక్రమణ విశ్వాసం విషయంలో కాకపోతే తల్లి తండ్రులు 'విశ్వాసులు' అన్న విషయం చెప్పటం కూడా అవసరం లేదు. అలా చెప్పారంటేనే పిల్లవాడు విశ్వాసానికి వ్యతిరేకంగా ఏదో చేస్తాడు అనే. ఎం చేస్తాడు అనేది చివర స్పష్టంగా ఇచ్చారు. ఖురాన్ లో నే విశ్వాసులయిన వారు, ఆఖరికి ప్రవక్తలు కూడా తమ సొంత బంధువులు(తండ్రి, భార్య, పిల్లలు, పిన తండ్రి) అవిశ్వాసులు అయినప్పుడు వారి గురించి ఎంత బాధ పడుతూ ఉంటారో మనకి ఇస్లాం సాహిత్యంలో కనిపిస్తూ ఉంటుంది.

కాబట్టి హుస్సేన్ గారు ఇక్కడ తలబిరుసుతనానికి, తిరస్కార వైఖరికి ఏ విషయంలో తలబిరుసుతనం, ఏ విషయంలో తిరస్కర వైఖరి అని అడిగితే, విశ్వాస విషయంలో అని చెప్పటమే సరైన పద్ధతి అవుతుంది కాని, తల్లి దండ్రులను నొప్పించకుండా ఉండే విషయంలో కాదు. తల్లిదండ్రులను నొప్పించే కారణమే దైవ తిరస్కార వైఖరి.

ఈ వాక్యం ప్రకారం అయితే ఖురాన్ ఒక వ్యక్తిని అవిశ్వాసి అయితే కాదు, అవిశ్వాసి అవుతాడేమో అన్న భయం వేసిన చెంపెయ్యొచ్చు అంటుంది.
అసలు భయమేసి చంపటమేమిటండి? మనకు ఏదైనా విషయంలో మన మాట వినడు అని అనిపిస్తే చంపేస్తామా?
మీకు ఇదంతా సరైనదిగానే అనిపిస్తుందా? పైగా దేవుడికి అన్ని ముందే తెలుసు తను అవిశ్వాసి అవుతాడని కూడా! అందుకే చంపెయ్యమన్నాడు అని అంటున్నారు. ముందే తెలిస్తే అసలు పుట్టించటం ఎందుకు? చంపటం ఎందుకు? అది మాకు చెప్పటమెందుకు?

మీరు జాగర్తగా చదివి నావి ఒప్పుకోనైనా ఒప్పుకొండి(మీకు మేలు జరుగుతే నాకు సంతోషం). లేదా నావి తప్పు అని అయినా నిరూపించండి( నాకు ఇలా మేలు జరిగితే ఇంకా సంతోషం)

Comments