వ్యక్తుల ప్రశ్నలు - ఖురాన్ సమాధానాలు 1

ఖురాన్ 2:13

మరియు, "ఇతర జనులు విస్వసిన్చినట్లు మీరూ విశ్వసించండి" అని వారితో అన్నప్పుడు వారు, "మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?" అని జవాబిస్తారు జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కానీ వారికి తెలియదు.

విశ్లేషణ:

  1. 'ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి' అని అనటం తప్పు కాదా! ఎందుకు విశ్వసించాలో చెబితే విశ్వసించాలో వద్దో వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
  2. ఇక్కడ అవిశ్వాసులు మూర్ఖులు అని కొంత మందిని ప్రత్యేకించి చెబుతున్నారా? లేక సాధారణంగానే విశ్వాసులందరినీ గురించి మాట్లాడుతున్నారా అన్నది స్పష్టత లేదు. అక్కడ మూర్ఖుడు అన్న పదం ఎందుకు వాడాడు అన్నది వివరాలు లేవు కాబట్టి పక్కన పెడితే, పక్కవాడు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా? అన్న ప్రశ్నలో తెప్పేమీ కనిపించటంలేదు.
  3. వీరు అడిగిన ప్రశ్నకు, అల్లాహ్ ఇచ్చిన సమాధానానికి ఎమన్నా సంబంధం ఉందా? చిన్న పిల్లలు నువ్వు దొంగా అంటే నువ్వు దొంగా అన్నట్లు, నువ్వు మూర్ఖుడు అంటే నువ్వే మూర్ఖుడు అంటున్నాడు అల్లాహ్. అసలు అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, వేరేవి చెప్పటం ప్రశ్నను పక్క దారి పట్టించటమే కదా.
  4. ఒక హిందువో, క్రైస్తవుడో వచ్చి ఇతరులు విశ్వసించినట్లు మీరు మా మతాన్ని విశ్వసించండి? అని అడిగితే ఒక ముస్లిం అంగీకరించాలా? అంగీకరించకూడదా?
  5. అల్లాహ్ ఈ ఆయత్ ద్వారా ఎం చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాడు? ఇతరులు విశ్వసించినట్లు మనము కూడా విశ్వసించక పోతే మూర్ఖులము అవుతామనా. 

Comments