ఒక వ్యక్తిని చంపితే సమస్త మానవాళిని చంపినట్టు అని నిజంగా ఖురాన్ చెబుతుందా?



ఒక వ్యక్తిని చంపితే సమస్త మానవాళిని చంపినట్టు అని నిజంగా ఖురాన్ చెబుతుందా?

ఈ కారణం వల్లనే మేము ఇస్రా'యీల్ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: ''నిశ్చయంగా ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ, గాక ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే. మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడి నట్లే!'' మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవారు.  (ఖురాన్ 5:32)

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు-చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోరశిక్ష ఉంటుంది   (ఖురాన్ 5:33)

ఖుద్దూస్: పైన ఉన్న ఖురాన్ వాక్యాలను జాగ్రత్తగా గమనించండి. ఆ ఖురాన్ వాక్యం వ్యక్తిని ఎందుకు చంపితే ఎంత ఘోరమూ చెబుతూనే, కొన్ని రకాల హత్యలను చేయదగినవిగా చెప్తుంది.
ఏ ఏ కారణాల చేత హత్య చేయవచ్చు అనేది పరిశీలిస్తే
5:32 లో
1.         హత్యకు బదులుగా చంపటం
2.       కల్లోలం వ్యాపించినందుకు చంపటం
ముందు హత్యకు బదులుగా హత్య చెయ్యవచ్చా? అన్నది పరిశీలించూదాం.
“నా తమ్ముడిని ఒకామె హత్య చేసింది అనుకుందాం. నేను ముందు వెనుక ఆలోచించకుండా ఆమెని చంపేసి, హత్యకు బదులుగా హత్య చేసాను కాబట్టి నేను చేసింది తప్పు కాదు అంటే అంగీకరిస్తారా? ఆమె నా తమ్ముడు తన పై చేసే దాడి నుంచి రక్షించుకోవటానికి చేసిన ఆత్మరక్షణ చర్య అయి ఉండవచ్చు కదా. ఆత్మరక్షణ కొరకు హత్య చెయ్యటం సర్వమానవులను హత్య చేసినట్టా? వారి కుటుంబానికి ఏకైక ఆధారమైన ఆమెని నేను పగ కోసం చంపితే తప్పు కాదా?” ఈ పరిస్థితుల్లో హత్యకు బదులుగా హత్య సమంజసం అనిపిస్తుందా మీకు?
ప్రతి ప్రాణం విలువైనదే. ఆ వ్యక్తి వలన మరి కొంత మంది వ్యక్తుల ప్రాణాలకు అపాయం ఉన్న సందర్భంలో తప్ప ఏ సందర్భంలో కూడా సమాజం వ్యక్తి మరణాన్ని సమర్థించకూడదు. అది కూడా ఆ వ్యక్తి మరణం సమాజం విధించే శిక్ష అయి ఉండాలి, లేదా ఆత్మ రక్షణ కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యక్తి చేసిన హత్య అయి ఉండాలి.  ఇంతవరకూ మీకు కూడా సరైనదే అనిపిస్తుంటే, ఖురాన్ ఆ భాగంలో తప్పు చెప్తుంది అని అర్ధం. మీకు తప్పు అనిపించకపోతే చెప్పండి. మాట్లాడుదాం ఈ విషయం పైన.

ఇక రెండవ అంశం.

కల్లోలం వ్యాపించినందుకు చంపటం

ఈ పదం చాలా చోట్ల వాడబడినప్పటికీ ఆ కల్లోలం అంటే ఏమిటో ఎక్కడ కూడా స్పష్టత ఉండదు ఖురాన్ లో. ఇది రచనా పరమైన బలహీనత. చాలా భయంకరమైన బలహీనత. ఇటువంటి బలహీనతలు, ఆయా వాక్యాలను మనుషులు వారి మనస్తత్వం ఆధారంగా వారికి ఇష్టం వచ్చినట్లు మలచుకుంటారు. మృదు  స్వభావులు అయిన ముస్లిములు,  దీనికి కల్లోలం అంటే ప్రపంచంలో జరిగే అన్యాయం, అసమానత, దౌర్జన్యం. ఇటువంటివి చేసే వారిని చంపినా తప్పు లేదు అని భాష్యం చెప్తుంటారు. కానీ స్వతహాగా కఠిన హృదయులు, లేదా ఇస్లాం బోధనల వలన మనసు కఠినం చేసుకున్న వారు అయితే, కల్లోలం రేకెత్తించటం అంటే అవిశ్వాసం, బహుదైవారాధన, విగ్రహారాధన వంటివి వ్యాపింపచెయ్యటమే. అటువంటివి వ్యాపింపచేస్తే చంపేయవచ్చు. కల్లోలం రేకెత్తించటం అంటే అవిశ్వాసాన్ని రేకెత్తించటమే అనే అర్ధాన్ని చెప్తూ ఉంటారు. ఇది చెబుతూ ఖురాన్ వాక్యాలని చూపించి అమాయకులైన సాధారణ ముస్లిములను ఉగ్రవాదం వైపు ప్రేరేపించటానికి కూడా అవకాశం ఉంది.

 

అయితే ఏ అర్ధం సరైనది?

ఖురాన్ 5:32 వ్యక్తులు చేసే హత్యల గురించి మాట్లాడుతుంటే, ఖురాన్ 5:33 సమాజం వేసే శిక్షల గురించి మాట్లాడుతుంది.
ఖురాన్ 5:33 చూడండి.   మరణ శిక్ష వేయమంటుంది ఏ పనులకి?
1.         అల్లాహ్ కి ఆయన ప్రవక్తకి వ్యతిరేకంగా పోరాడితే
2.       కల్లోలం రేకెత్తించే ప్రయత్నం చేస్తే
ఇక్కడ మళ్ళీ కల్లోలం రేకెత్తించే ప్రయత్నం చేస్తే అన్న ప్రస్తావన తీసుకుని రావడం జరిగింది. కానీ ఆ కల్లోలం అంటే స్పష్టత లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.
కానీ, అల్లాహ్ కి ఆయన ప్రవక్తకి వ్యతిరేకంగా పోరాడటం అంటే ఏమిటి?
అల్లాహ్ పేరున చెప్పబడుతున్న అభిప్రాయాలు, అంటే ఖురాన్ కి, అల్లాహ్ ప్రవక్తగా చెలామణీ అవుతున్న మొహమ్మద్ కీ వ్యతిరేకంగా ఉన్న భావాలను ప్రచారం చెయ్యటం. మిగతా వ్యక్తులను కూడా అల్లాహ్ కి , ప్రవక్తకీ వ్యతిరేకులుగా తయారు చేయటం.
ఇది ఇస్లామిక్ సమాజానికి సంబంధించిన చట్టం. అందుకే చాలా ఇస్లామిక్ దేశాలలో ఇది అమలు చేస్తారు. అల్లాహ్ కి , మొహమ్మద్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అతనికి మరణ శిక్షే.
ఈ మధ్య అయితే పాకిస్తాన్ ప్రభుత్వం facebook లో అటువంటి పోస్టులు ఎక్కువైపోతున్నాయి అని
facebook అధికారులతో సంప్రదించి మరీ అటువంటివి  ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంటుంది. అలా చేసిన వారికి కఠినమైన మరణ శిక్షలను విధిస్తుంది. ఈ మధ్య జరిగిన మషాల్ ఖాన్ ఉదంతం మరింత పెద్ద విషాదం. కేవలం ఇస్లాం కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న అనుమానం కారణంగా గుంపు గుంపుగా దాడి చేసి చంపేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే, వారు కూడా అడ్డు పడకుండా సమర్థించటం దారుణం. తమిళ్ నాడు లో ఫరూక్ పై జరిగిన దాడి కూడా అటువంటిదే. అప్పటివరకు తమ స్నేహితులే, ఫారూక్ తన పిల్లల చేత అల్లాహ్ లేడు అని ఫోటో పెట్టించినందుకు ఆగ్రహించి చంపివేశారు.

అటువంటి ఆగ్రహాలకు, ఆవేశాలకు ఈ వాక్యాలు ప్రేరణను ఇస్తాయి అంటే ఎలా కాదనగలను?

ఇది ఎంత దారుణమైన విషయం అండి? ఖురాన్ కేవలం నేను పుట్టాక నా ముందు వచ్చిన చాలా పుస్తకాలలో ఒక పుస్తకం. మిగతా పుస్తకాలలాగే కొన్ని కథలు, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆధారాలు లేని విషయాలు చాలా ఉన్నాయ్. నమ్మటం నమ్మకపోవటం నా ఇష్టం. నేను నమ్మకపోతే ఎందుకు నమ్మనో చెప్పుకునే స్వేచ్ఛ నాకు లేకపోతే ఎలా? మీరు ఎందుకు నమ్ముతున్నారో చెప్పే స్వేచ్ఛ తీసుకునే కదా నమ్మనోల్ల దగ్గర ఇస్లాం ప్రచారం చేస్తున్నారు. అసలు ఇస్లాం ప్రకారం జీవితమే ఒక విశ్వాస పరీక్ష కదా. ఒక వ్యక్తి మధ్యలో పరీక్ష సరిగ్గా రాయకపోతే, మధ్యలోనే అతనికి పరీక్ష పూర్తి చేసే అవకాసం ఇవ్వకుండా చంపెయ్యటం ఏమిటి?
దీనికి మీరు ఇలా చెప్పొచ్చు, అతని వాళ్ళ మిగతా వారు కూడా పరీక్షలో విఫలం అయ్యేలా ఉన్నారు. మిగతావారిని రక్షించటం కోసం వీరిని అల్లాహ్ చంపేయమనటం సమంజసమే అని. కానీ మిగతా వారు కూడా పరీక్షలోనే ఉన్నారు కదా. పరీక్ష పెడుతున్నాను అని చెప్పినపుడు పరీక్ష పూర్తి అయ్యే వరకు ఆగాలి. అంతటి అవిశ్వాసుల మధ్య వీరు విశ్వాసం నిలబెట్టుకునే నిజమైన విశ్వాసులా కాదా అన్నది కూడా పరీక్షే కదా విశ్వాసానికి. విశ్వాసులు పరీక్షలో విఫలం అవ్వకూడదు అని కోరుకుంటున్న అల్లాహ్ , అవిశ్వాసి పట్ల కూడా కోరుకోవాలి. ప్రతి ఒక్కరు విఫలం అవ్వగుండా చూడవలసిన బాధ్యత అల్లాహ్ దే కదా..

అల్లాహ్ పై పోరాడేవారికి మరణశిక్ష వేయటం ఎంత అధర్మమో అర్ధం అవుతుందా?
అల్లాహ్ కి ఎందుకంత అభద్రతా భావం తనకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వారు ఉంటే? అన్నది గమనిస్తే నాకు అనిపించింది ఏమిటంటే, నిజానికి దేవుడికి అభద్రతా భావం ఉండదు. ఆ అభద్రతా భావం అల్లాహ్ ది కాదు, ఆ పేరున అధికారం చెలాయిస్తున్న మొహమ్మద్ ది అని అనిపించింది. ఎందుకంటే ఇస్లాం చాలా బలహీనమైన ఆధారాలపై ఏర్పడిన నమ్మకం. బలమైన ప్రశ్నలను ఆ నమ్మకం ఎదుర్కోలేదు. తన అధికారం కాపాడుకోవాలంటే, తన అనుచరులను బయటికి వెళ్ళకుండా కాపాడుకోవాలి మొహమ్మద్. అందుకోసమే తన అనుచరులను బయటికి వెళ్ళటానికి ప్రేరేపించే అవిశ్వాసులను చంపివేయమని అల్లాహ్ ద్వారా ఆజ్ఞాపించాడు. ఇస్లాం నుంచి జనాలు బయటికి వెళ్ళిపోవటం, తన అనుచరుల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అని గమనించిన మొహమ్మద్, అలా బయటకి వెళ్ళిన వారిని చంపివేయమని ఆజ్ఞాపించాడు. అధికారం కోసం తపించే వ్యక్తిగా నేను ముహమ్మద్ ని చూడటం లేదు. కానీ, తన లక్ష్యాల సాధనకు అధికారం ఇచ్చే బలాన్ని గమనించిన ముహమ్మద్, ఆ లక్ష్య సాధన కోసం అధికారాన్ని కాపాడుకోవటానికి చేయవల్సినవన్నీ ఇలా చేస్తున్నట్టు అనిపించింది.

ఎంతో దారుణమైన భావాలు,   హింస  ఉన్న ఈ వాక్యాలలో చిన్న చిన్న ముక్కలు ఏరుకుని, వాటితో ఇస్లాం అంటే శాంతి అని చూపించే ప్రయత్నాలను చూస్తుంటే నవ్వొస్తుంది నాకు.

Comments

  1. మీకు ఒత్తిడులు వస్తున్నాయేమో! అనిపిస్తుంది.

    మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను.
    విశ్వాసం ఉండాలా? వద్దా? ఉంటే దేనిపై ఉండాలి. వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. నా వాట్సాప్ నంబర్ 8985031815

    ReplyDelete
    Replies
    1. విశ్వాసం లేనిదే జీవితం ముందుకు వెళ్ళదు. ప్రతి ఒక్కటి సొంత అనుభవంలోకి వస్తే తప్ప అంగీకరించను అంటే అడుగులు ముందుకు వెయ్యటం గగనం అయిపోతుంది. అయితే మన జీవితానికి అవసరం అయిన విషయాల వరకే నా విశ్వాసం పరిమితం. మనతో సంబంధం లేని విషయాల పట్ల విశ్వాసం అనవసరం అని నా ఉద్దేశం.

      Delete
  2. chala baga chepparu

    naa prashnaku samadanam icchinanduku danyavadamulu

    ReplyDelete
  3. chala baga chepparu

    naa prashnaku samadanam icchinanduku danyavadamulu

    ReplyDelete
  4. Naku inka ilantivi chadivi telusukovalani voundi na ei watsup 7680037850 number ki ilanti stories pampagalara

    ReplyDelete

Post a Comment